బిగ్ బాస్ 5 : ఈవారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా రెండు సీజన్స్ పూర్తి చేసుకుంది. మూడో వారంలోకి అడుగుపెట్టింది. తొలివారం సరయు ఎలిమినేట్ కాగా, రెండో వారం ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడోవారానికి గానూ మంగళవారం ఎలిమినేషన్ ప్రాసెస్ హాట్ హాట్ జరిగింది. ఈ సందర్భంగా కంటెస్టెంట్‌ల మధ్య వాడీవేడీగా వాదనలు జరిగాయి. హౌస్‌లో ఉండేందుకు అర్హత లేని, తమకు ఇష్టంలేని పోటీదారుల పేర్లను బోర్డుపై ముద్రించి.. అందుకు తగిన కారణాలు చెప్పి.. ఆ బోర్డును సుత్తితో బద్దలు కొట్టాల్సిందిగా బిగ్‌బాస్‌ సూచించారు.

 ప్రియ చేసిన వ్యాఖ్యలపై అసహనానికి గురైన షణ్ముఖ్‌, కాజల్‌ కూడా ఆమెను నామినేట్‌ చేశారు. ‘నీకు సర్జరీ జరిగిందా?’ అంటూ ప్రియ తనని అడగడం బాడీ షెమింగ్‌లా అనిపించిందని చెబుతూ హమీదా సైతం ఆమెనే నామినేట్‌ చేసింది. అలా, తీవ్ర వాదోపవాదాలు, ఘాటైన విమర్శలు, సుదీర్ఘ వివరణలతో మూడోవారం బిగ్‌బాస్‌ నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. శ్రీరామచంద్ర, ప్రియలను అత్యధిక మంది నామినేట్‌ చేయగా.. లహరి, ప్రియంక, మానస్‌లు కూడా నామినేషన్స్‌లో చేరారు.