కేటీఆర్ పై రేవంత్ ఎటాక్.. తాత్కాళిక బ్రేక్ !
అసత్య, నిరాధార ఆరోపణలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సామాజిక మాధ్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో సహా బహిరంగంగా బేషరతు క్షమాపణ చెప్పేలా ఆదేశాలివ్వాలంటూ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై మంగళవారం సిటీ సివిల్ కోర్టు 3వ అదనపు చీఫ్ జడ్జి కల్యాణ్ చక్రవర్తి విచారణ చేపట్టారు.
దర్యాప్తు నేపథ్యంలో కేటీఆర్ పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీసేలా ఎలాంటి చర్యలు చేపట్టరాదంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దర్యాప్తులో ఉన్న క్రిమినల్ కేసుతో ముడిపెడుతూ ఆరోపణలు చేయడం సరికాదని జడ్జి అన్నారు. విచారణ నిమిత్తం నిందితులు కానివారికీ నోటీసులు జారీ చేస్తారని, వారి పాత్ర ఉంటేనే నిందితులుగా చేరుస్తారని చెప్పారు. విచారణను అక్టోబరు 20కి వాయిదా వేసింది. దీంతో కేటీఆర్ పై డ్రగ్స్ ఆరోపణల విషయంలో రేవంత్ రెడ్డి తాత్కాళిక బ్రేక్ ఇవ్వక తప్పని పరిస్థితి.