లవ్ స్టోరీ సుఖాంతం కాదు
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ శుకవారం (సెప్టెంబర్ 24) ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలరూ, పాటలూ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దీంతో తొలి మూడు రోజులూ థియేటర్లు నిండిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ పైనే లవ్ స్టోరీ
జాతకం ఆధారపడి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ? కుల, లింగ వివక్షపై తీసిన సినిమా ఇది.
తొలి సగం… హాయిగా సాగిపోయినా, రెండో సగంలో బలమైన ఎమోషన్స్ దట్టించాడట. క్లైమాక్స్ లో శేఖర్ కమ్ముల గట్టి షాక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. పరువు హత్య లాంటి ఉదంతం ఈ సినిమా క్లైమాక్స్ లో ఉండబోతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓకరంగా లవ్ స్టోరీ సుఖాంతం కాదు. దుఃఖాంతమే. అయితే… తెలుగు ప్రేక్షకులకు సుఖాంతాలే రుచిస్తాయి. నెగిటీవ్ క్లైమాక్స్‌లు భరించడం కష్టం. కానీ… శేఖర్ కమ్ములకి తన కథపై, తన క్లైమాక్స్‌పై బలమైన నమ్మకంతో… చివరి పది నిమిషాలే కథకు ప్రాణం అని భావిస్తున్నాడు. ఆ సీన్స్ కి ప్రేక్షకుడు కనెక్ట్ అయితే లవ్ స్టోరీ సూపర్ హిట్. లేదంటే.. భంగపాటు తప్పదు.