PBKSvsRR : ఆఖర్లో అద్భుతం
ఐపీఎల్ పార్టు 2లో రాజస్థాన్ సంచలన విజయంతో ఆరంభించింది. మంగళవారం 2 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. పంజాబ్ లక్ష్యం 186. 19 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 182/2. చివరి ఓవర్లో పంజాబ్ చేయాల్సింది 4 పరుగులే. క్రీజులో విధ్వంసక బ్యాట్స్‌మెన్ పూరన్, మార్‌క్రమ్. అప్పటికి వాళ్లు మంచి ఊపులో ఉన్నారు కూడా. పంజాబ్ కూల్ గా గెలిచేస్తుంది అనుకున్నారు. కానీ ఆఖరి ఓవర్ కోసం బంతి అందుకున్న కార్తీక్ త్యాగి అద్భుతం చేశాడు. కేవలం ఒక్క మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
తొలి బంతికి పరుగు రాలేదు. రెండో బంతికి సింగిల్. మూడో బంతికి పూరన్ ఔట్. కాస్త ఉత్కంఠ రేగినా 3 బంతుల్లో చేయాల్సింది 3 పరుగులే కాబట్టి పంజాబ్ గెలుపు కష్టమేం కాదన్న అంచనా. కానీ నాలుగో బంతికి పరుగు రాలేదు. ఉత్కంఠ పెరిగిపోయింది. అయిదో బంతికి వికెట్. వాతావరణం వేడెక్కిపోయింది. సంచలన బౌలింగ్‌ను కొనసాగిస్తూ కార్తీక్.. చివరి బంతికీ పరుగివ్వలేదు. పంజాబ్ ఖేల్ ఖతం. రాజస్థాన్ ఖాతాలో అనూహ్య విజయం!
ఓటమిపై కెఎల్ రాహుల్ నిరాశ :
‘ఈ ఓటమిని స్వీకరించడం చాలా కష్టం. ఇదివరకు కూడా మా జట్టు ఇలాంటి అనుభవాలు చవిచూసింది. మేం ఒత్తిడిని ఎలా జయించగలమో చూడాలి. అయితే, మేం గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకోలేదని అనిపిస్తోంది. ఇకపై బలంగా పుంజుకొని మిగతా ఐదు మ్యాచ్‌లు గెలిచేందుకు ప్రయత్నిస్తాం. మేం బంతితో మంచి ప్రదర్శన చేశాం. అవసరమైన సమయాల్లో వికెట్లు తీశాం. ఇక మా బ్యాటింగ్‌లో నేనూ మయాంక్, మార్‌క్రమ్ పరుగులు చేయడం చాలా ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు ముందుగానే మ్యాచ్‌ను ముగించాలని ప్రయత్నిస్తే అది ప్రత్యర్థులకు కలిసివచ్చే ప్రమాదం ఉంటుంది’ అని రాహుల్ అన్నారు.
#KartikTyagi Defended 4 runs in the Final over 💥💥💥
That too with Markram & Pooran on strike😮
What a blowing
Young Guns 🔥🔥🔥#PBKSvRR #IPL2021
@rajasthanroyals pic.twitter.com/rqTNheJhjW— Venky NTR ❤️🌊 (@Ntr1Devudu) September 22, 2021