‘పెళ్లి సంద‌D’ ట్రైలర్ చూశారా ?

శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్ర‌ం ‘పెళ్లి సంద‌D’. శ్రీ‌లీలా క‌థానాయిక‌. ద‌స‌రాకి ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈరోజు ట్రైల‌ర్ వ‌చ్చేసింది. ఈ చిత్రానికి రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేశారు.

ఓ అబ్బాయి, ఓ అమ్మాయి.. వాళ్లిద్ద‌రూ ఓ పెళ్లిలో క‌లుసుకోవ‌డం, ప్రేమించుకోవ‌డం, ఆ త‌ర‌వాత విడిపోవ‌డం.. మ‌ధ్య‌లో ఫైట్లు, అంద‌మైన పాట‌లు, రొమాంటిక్ సీన్లూ… వెర‌సి మొత్తంగా రాఘ‌వేంద్ర‌రావు సినిమానే చూస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చింది. రాఘ‌వేంద్రుడ్నీ రెండు ఫ్రేముల్లో చూసే ఛాన్స్ వ‌చ్చింది. ఆయ‌న నుంచి డైలాగే వినిపించ‌లేదు. కీర‌వాణి సంగీతం ఈ చిత్రానికి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌.