RRR టార్గెట్ మారింది

అక్టోబర్ 13న రావాల్సిన #RRR వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరిలోకి దిగనుంది అనే వార్తలు గత కొన్నాళ్లుగా వార్తల్లో వినిపిస్తోంది. అది జరిగితే.. ఇప్పటికే షెడ్యూలు చేసుకున్న సినిమాలు తప్పుకోవాల్సి వుంటుంది. పవన్ కల్యాణ్, మహేష్, ప్రభాస్.. ఇలా అంతా కొత్త డేటు చూసుకోవాల్సి ఉంటుంది అనుకున్నారంతా. అయితే ఆర్ఆర్ఆర్ అసలు టార్గెట్ 2022 సంక్రాంతి కాదట. ఉగాది అని తెలిసింది.

సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ వస్తుందంటే.. తెలుగు సినిమాలు పక్కకు తప్పుకుంటాయేమో. కానీ తమిళ్ లో ఆ పరిస్థితి ఉండదు. కోలీవుడ్ స్టార్ అజిత్ వలిమై సినిమాను 2022 సంక్రాంతికి విడుదల అంటూ ప్రకటించేసారు.  అజిత్ సినిమా వుంటే తెలుగు సినిమాకు థియేటర్లు, స్క్రీన్ లు దొరకడం అన్నది అంతంతమాత్రం. గతంలో ఈ విషయం అనేకసార్లు ప్రూవ్ అయింది కూడా. అందువల్ల ఆర్ఆర్ఆర్ తమిళ వెర్షన్ భారీ విడుదల అన్నది కాస్త ఇబ్బంది అవుతుంది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ టార్గెట్ మారింది. ఉగాధికి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.