ట్విట్టర్ రివ్యూ : లవ్ స్టోరీ

తెలుగు ప్రేక్షకులని ‘ఫిదా’ చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల. ఫీల్‌గుడ్‌ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఆయన ప్రస్తానం కొనసాగుతుంది. దర్శకుడిగా టాలీవుడ్‌పై ప్రత్యేక ముద్రవేశాడు. ‘ఆనంద్‌’, ‘గోదావరి’, ‘హ్యాపీడేస్‌’, ‘ఫిదా’ ఇలా ఆయన సినిమాలన్నీ ప్రత్యేకమైన శైలిలో కొనసాగుతాయి. ఆయన తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’. నాగచైతన్య-సాయి పల్లవి జంటగా నటించారు. లవ్ స్టోరీ పాటలు, టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. మూడ్రోజుల పాటు టికెట్స్ ముందే బుక్కైపోయాయ్. ఇలాంటి భారీ అంచనాల మధ్య లవ్ స్టోరీ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే యుఎస్ లో షోస్ పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో బినిఫిట్ షోస్ పడిపోయాయి. దీంతో ట్విట్టర్ వేదికగా సినిమా చూసిన ప్రేక్షకులు లవ్ స్టోరీ విశేషాలని పంచుకుంటున్నారు.

అందరూ వన్ సైడ్ గా లవ్ స్టోరీ సూపర్ అంటున్నారు. తెలుగు తెరపై పవర్ ఫుల్ సినిమా. డ్రామా, బలమైన ఎమోషన్స్, అద్భుతమైన నటనతో సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారని చెబుతున్నారు. కథ-కథనాలు అద్భుతంగా కుదిరాయి. ఫిదా అంతకుమించిన సినిమా. క్లైమాక్స్ విషాదాంతం అయినా.. దర్శకుడు కన్విన్సింగ్ గా చెప్పాడని చెబుతున్నారు. మొత్తానికి.. లవ్ స్టోరీకి వందమార్కులు వేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అని తేల్చేస్తున్నారు. మరి..కొద్దిసేపట్లో పూర్తి రివ్యూని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది… మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.