‘సారంగదరియా.. ఇప్పుడిదో ట్రెండయా’
‘వై దిస్ కొలవెరి’ అంటే యువత వెర్రెత్తిపోయింది. ‘ఓపెన్ గంగ్నమ్ డ్యాన్స్’ అంటే ప్రపంచం చిందులేసింది. ప్రియా ప్రకాశ్ కన్నుగీటితే యువత మనసు కువకువలాడింది. నీ బుల్లెట్ బండి అంటే పెళ్లికూతుళ్లు ఆగడం లేదు. ఇప్పుడు ట్రెండ్ సాయి పల్లవి ‘సారంగదరియా’ది. చిన్నారుల నుంచి పెద్దల వరకూ ఈ పాటకు తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
నాగచైతన్య-సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’ . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈరోజు (సెప్టెంబరు 24) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సందర్భంగా ప్రస్తుతం యూట్యూబ్‌లో సారంగదరియా ట్రెండ్ అవుతోంది. సినిమా రిలీజ్ తో సారంగదరియా ఖాతాలో కొత్త కొత్త రికార్డులు వచ్చి చేరడం ఖాయం. ఇక ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన లవ్ స్టోరీ పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు.