సహజత్వమే ఇష్టం
‘ఫిదా’ కోసం బాన్సువాడలో.. ‘లవ్‌స్టోరి’ కోసం ఆర్మూర్ మండలం పిప్రి, మంథిని గ్రామాల ఇళ్లు చక్కగా సరిపోయాయని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. కథకు తగ్గట్లు అనుకూల ప్రాంతాలను ఎంచుకుంటే ప్రేక్షకులు ఆస్వాదించేలా చిత్రీకరించొచ్ఛు తద్వారా అందరూ ఆదరించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు నేను తీసిన సినిమాల్లో ఈ విధానాన్నే పాటించానని వివరించారు.
స్థానికుల మంచితనం వల్ల చిత్రీకరణ సులువుగా చేసుకోవచ్ఛు యూనిట్ సభ్యులతో త్వరగా కలిసిపోతారు. ఏదైనా అడిగితే వెంటనే సమకూర్చుతారు. పిప్రిలో రాజారెడ్డి, భోజారెడ్డి బాగా సహకరించారు. వారి ఇళ్లు ఇవ్వడమే కాకుండా మేము లోపల ఉంటే వారు బయట ఉన్నారు. తిరిగి వెళ్లే సందర్భంలో గ్రామస్థులందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో రన్ అవుతున్న సంగతి తెలిసిందే.