హుజురాబాద్ ఉప ఎన్నిక.. షెడ్యూల్ వచ్చేసింది !
తెలంగాణలోని హుజురాబాద్, ఏపీలోని బద్వేలు శాసనసభ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 30న ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
వరుస పండగల నేపథ్యంలో దసరా తర్వాత ఉప ఎన్నికలని నిర్వహిస్తామని ఇటీవల ఎన్నికల సంఘం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దసరా తర్వాత ఉప ఎన్నికలని నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా తాజాగా హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది.
ఇక హుజురాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలని హీటెక్కుస్తుంది. ఇక్కడ గెలిచి ప్రజల్లో తమకు ఏమాత్రం ఆదరణ తగ్గలేదని నిరూపించుకోవాలని తెరాస భావిస్తుంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో గులాబి పార్టీని ఓడించి.. వచ్చే ఎన్నికల్లో రాబోయేది మా ప్రభుత్వమే అనే సంకేతాలు ఇవ్వాలని తెలంగాణ భాజాపా భావిస్తుంది. హుజురాబాద్ లో గెలవకపోయిన గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నది. త్రిముఖ పోటీతో హుజురాబాద్ ఉప ఎన్నిక హీటుని పెంచుతుంది.