సమంతకు కొత్త తోడు దొరికేసింది

స్టార్ హీరోయిన్ సమంత భర్త నాగ చైతన్యతో విడిపోయింది. ప్రస్తుతం వీరి విడాకుల వ్యవహారం కోర్టులో ఉంది. ఒకట్రెండు సార్లు కౌన్సిలింగ్ నిర్వహించినా ఫలితం లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అవి నిజమే అన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా హింట్స్ ఇస్తుంది సామ్. తన ట్విట్టర్ ఖాతాలో అక్కినేని పదాన్ని తొలగించింది. సినిమాలకు బ్రేక్ తీసుకొని…. తనకు నచ్చిన పనులని చేసుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పుడిదే నాకు తోడు అంటూ పారా సైక్లింగ్ చేస్తున్న ఫోటోలని షేర్ చేసింది. 

సోమవారం ఉదయం హైదరాబాద్‌ నగరంలో వర్షం పడుతుండగా.. పారా సైక్లిస్ట్స్‌తో కలిసి సైకిల్‌ రైడ్‌కి వెళ్లారామె. ఈ సందర్భంగా వారితో కలిసి సైకిల్‌ తొక్కుత్కున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నారు. ” ప్రతీ రోజూ ఈ పారా సైక్లిస్ట్స్‌, సైకిలింగ్‌ .. నాకు స్ఫూర్తి. వర్షంలో వీరితో కలిసి ఇలా సైకిల్‌ తొక్కడం.. అదే ఓ చక్కటి తోడు. తొలిరోజే 21కిలోమీటర్లు తొక్కాను.. త్వరలోనే వంద కిలో మీటర్లను చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నా” అని తెలిపారు.

@Samanthaprabhu2 cycling for Adityamehta foundation @AdityaMehtaF #SamanthaAkkineni #Samantha pic.twitter.com/AHLc9gW2O9— Samantha (@Samaddict2804) September 27, 2021