చిరు పక్కన ఆ ముగ్గురు ఎవరు ?

‘ఆచార్య’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీంతో మిగతా మూడు సినిమాలపై చిరు దృష్టి కేంద్రీకరించారు. ‘గాడ్‌ఫాదర్’ కోసం రంగంలోకి దిగారు. ‘భోళాశంకర్’తోపాటు బాబీ దర్శకత్వం వహించనున్న సినిమా పట్టాలెక్కనున్నాయి. ఈ నేపథ్యంలో చిరుకి జోడీగా నటించే కథానాయికలకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

‘భోళాశంకర్’లో చిరంజీవికి చెల్లెలుగా కీర్తిసురేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో కథానాయికగా తమన్నా ఎంపికైనట్టు తెలిసింది. ‘గాడ్‌ఫాదర్’ విషయంలోనూ పలువురు పేర్లు వినిపించినా.. అందులో చిరుకి జోడీగా కథానాయిక కనిపించదట.

ఇక బాబీ దర్శకత్వం వహించనున్న సినిమా కోసం ఇప్పటికే బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాని సంప్రదించిన విషయం తెలిసిందే. ఆమె ఓకే చెబుతుందా ? లేదా ?? అన్నది చూడాలి. మరోవైపు ఆచార్య సినిమాకు ముందు ఓకే చెప్పేసి.. ఆ తర్వాత తప్పుకున్న త్రిషకు మరోసారి మెగా ఆఫర్ దక్కినట్టు సమాచారమ్.
