‘క్వీన్’కు సీఎం కానుక !
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కానుక ఇచ్చారు. శుక్రవారం లఖ్‌నవూలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లిన కంగనా సీఎం యోగితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం తనకు రామజన్మభూమి వద్ద పూజలో ఉపయోగించిన నాణేన్ని కానుకగా అందజేశారు. యూపీ ప్రభుత్వం చేపట్టిన ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి బ్రాండ్‌కు కంగన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్థానిక, ప్రత్యేక ఉత్పత్తులతో పాటు కళలను ప్రోత్సహించడమే లక్ష్యంగా యోగి ప్రభుత్వం వన్ డిస్ట్రిక్ట్- వన్ ప్రొడక్ట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది.
సీఎంతో భేటీ అనంతరం కంగనా మీడియాతో మాట్లాడారు. అయోధ్యకు సంబంధించి తాను సినిమా తీస్తున్నట్టు ఇన్‌స్టాలో తెలిపారు. ప్రస్తుతం తాను నటిస్తున్న తేజస్ చిత్రం షూటింగ్‌కు సహకరిస్తున్న యూపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికలకు సీఎం యోగికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పినట్టు తెలిపారు..