లేడీ కమెడియన్ బికినీ షో

విద్యుల్లేఖ రామన్ – ఎక్స్ప్రెషన్స్, కామెడీ టైమింగ్ అదుర్స్. తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హాస్యనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది తన స్నేహితుడి సంజయ్‌తో నిశ్చితార్థం జరగ్గా, కొన్ని రోజులు కిందట వివాహం కూడా చేసుకున్నారు. కరోనా కారణంగా బంధువుల, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.

ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ బీచ్‌లో బికినీలో దిగిన ఫొటో షేర్ చేస్తూ ‘ఏడాదికి రెండుస్లారు ఆరు నెలల పాటు సెలవులు కావాలి’ అని పేర్కొంది. తెలుపు, పసుపు రంగు బికినీ ధరించి, కళ్లజోడు పెట్టుకుని దిగిన ఫొటోకు ఫొటోకు కామెంట్స్ వెల్లువెత్తాయి. కొందరు నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌ను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. ‘విడాకులు ఎప్పుడు తీసుకుంటున్నారు’ అని అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, విద్యుల్లేఖ రామన్ తీవ్రంగా స్పందించారు. ఆంటీస్.. అంకుల్స్ 1920ల నాటి కాలాన్ని వదిలి 2021కు రండి. సమస్య నెగెటివ్ కామెంట్స్ వల్ల కాదు. సమాజం ఆలోచించే తీరును బట్టి ఉంటుందని చురకలంటించింది.

