సామ్-చై విడాకులపై వెంకీ ఏమన్నారంటే ?
తమ వైవాహిక బంధానికి ముగింపు పలికినట్లు నాగచైతన్య – సమంత ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై అక్కినేని కుటుంబానికి చెందిన పలువురు తారలు.. సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు వాళ్లిద్దరూ విడిపోవడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విక్టరీ వెంకటేశ్ స్పందించారు. ‘మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి’ అంటూ వెంకీ ఓ పోస్ట్ పెట్టారు.
సామ్ తండ్రి ఏమన్నారంటే ?
సామ్-చై విడాకుల నిర్ణయంపై తాజాగా సమంత తండ్రి స్పందించారు. వాళ్ల జోడీ చూడముచ్చటగా ఉండేదని.. అలాంటిది, ఇప్పుడు వాళ్లిద్దరూ విడిపోవడం దురదృష్టకరమని అన్నారు. అంతేకాకుండా.. వాళ్లిద్దరూ విడిపోతున్నారని తెలిసి మైండ్ బ్లాంక్ అయ్యిందని.. ఏం చేయాలో అర్థం కాలేదని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నా అన్నారు.