కేసీఆర్ మరోసారి ముందస్తు వ్యూహాం ? వచ్చే యేడాది ఆఖరులో ఎన్నికలు !
సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవ్వరికీ అర్థం కావు. వాటిని ప్రత్యర్థులు అర్థం చేసుకొనే లోగా కేసీఆర్ పని కానిచ్చేస్తారు. ఫలితం కూడా పొందుతారు. ఇప్పుడు కేసీఆర్ మరో అద్భుతమైన వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్టు సమాచారమ్. అదే ముందస్తు వ్యుహాం. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు. ప్రతిపక్షాలని ఏమాత్రం బలపడనీయకుండా.. కనీసం ప్రచారానికి టైమ్ లేకుండా చేస్తూ.. అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. అయితే కేసీఆర్ మరోసారి ముందస్తు వ్యూహాం పన్నుతున్నాడు.
ఇందులో భాగంగా బయటకి తీసిన అస్త్రమే దఌత బంధు అనే ప్రచారం జరుగుతున్నది. కేసీఆర్ సర్కారు రెండో దఫా పాలన ఇప్పటికే మూడేళ్లు పూర్తయింది. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ముందస్తుకు వెళ్లాలి. వచ్చే యేడాది ఆఖరులో ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేసుకోవాలనే వ్యూహాంతో కేసీఆర్ ఉన్నారని టాక్. అందుకే హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని మరో నాలుగు మండలాల్లో దఌతబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్నారు. మిగితా నియోజకవర్గాల్లో వంద మంది దళీతులకు దళీతబంధు ఇస్తారు. ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళతారు. మళ్లీ తెరాస అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని దళీతులందరికీ దళీతబంధు ఇస్తామనే అజెండాతో కేసీఆర్ ఎన్నికలకు వెళ్లనున్నారని తెలుస్తోంది.
రాష్ట్రంలో దాదాపు 18శాతం ఉన్న దఌతులు తిరిగి తనని గెలిపిస్తారనే ధీమాతో కేసీఆర్ ఉన్నారు. బీసీల పాట పాడుతున్న బీజేపీ చెక్ పెట్టడంలో భాగంగా కేసీఆర్ దళీత పాట అందుకున్నారు. ఇక కాంగ్రెస్ ని దెబ్బతీసేందుకు వైఎస్ షర్మిలని రంగంలోకి దింపారు. ఆమె రెడ్లు, ముస్లింలు, క్రిస్టియన్ ఓట్లని చీల్చడం ఖాయం. మొత్తానికి.. పలు వ్యూహాలతో కేసీఆర్ ముందస్తు ప్లాన్ చేసుకున్నారు. దాన్ని పక్కాగా అమలు చేస్తే.. మరోసారి అధికారం గులాబి పార్టీదే. కానీ ఈసారి సీఎం మాత్రం కేసీఆర్ కాదు. కేటీఆర్ కు పట్టాభిషేకం చేసే అవకాశాలు ఉన్నాయి.