స్టార్ హీరోల సపోర్టు మంచు విష్ణుకే !

ఈ నెల 10న ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ప్రకాష్ రాజ్ – మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం పీక్స్ చేరింది. మరోవైపు ఇతర నటీనటులు తమ మద్దతు ఎవరికి ? అన్నది స్పష్టత ఇస్తూ.. ఎన్నికల సమరాన్ని ఆసక్తిగా మారుస్తున్నారు. తాజాగా మా ఎన్నికలపై స్పందించిన నటుడు రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా మద్దతు మంచి విష్ణుకే అని తేల్చి చెప్పేశారు. అంతేకాదు.. బాలయ్యతో పాటు స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్, ఎటీఆర్ ల సపోర్టు కూడా మంచి విష్ణుకు దక్కే అవకాశాలు  ఉన్నాయి. ఆయన గెలిచే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు.

ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో నేను విష్ణు ప్యానెల్‌కే సపోర్ట్‌ చేస్తున్నాను. ఎందుకంటే, ‘మా’ బిల్డింగ్‌ నిర్మాణం, సభ్యుల సంక్షేమంపై ఆయన పూర్తి స్పష్టతతో ఉన్నారు. ఆయనే తప్పకుండా గెలుస్తారని ఆశిస్తున్నారు. అలాగే, మంచు విష్ణుకు బాలకృష్ణ సపోర్ట్‌ చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మహేశ్‌, ప్రభాస్‌ ఎన్టీఆర్‌.. ఇలా ఇతర నటీనటులు కూడా ఆయనకే మద్దతు ఇవ్వవచ్చు. మరో విషయం ఏమిటంటే.. మా ఇంటికి ఎవరైనా బంధువు వస్తే అతనికి సకల మర్యాదలు చేస్తాను. అన్ని రకాలుగా అతిథ్యం కల్పిస్తాను. కానీ, మా ఇంటి సమస్యల్లో అతను పెద్దరికం తీసుకుంటే.. నేను ఎందుకు ఒప్పుకుంటాను?’ అని రాజీవ్‌ కనకాల అభిప్రాయపడ్డారు.