రకుల్ బాగా కోపరేట్ చేసింది

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో రొమాన్స్ చేయడం కంటే వెయ్యి గొర్రలని కాయడం ఈజీ అంటున్నారు యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. వీరుద్దరు జంటగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమ్ కొండపొలం. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వైష్ణవ్.. రొమాంటిక్ సన్నివేశాల్లో ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చారు.

ఉప్పెనలో కూడా రొమాన్స్ చేశాను. కానీ టెన్షన్ పడలేదు. ఎందుకంటే కృతిషెట్టికి కూడా అదే మొదటి సినిమా. కానీ కొండపొలంలో నేను జూనియర్, రకుల్ చాలా చాలా సీనియర్. అంత సీనియర్ తో రొమాన్స్ అంటే కొంచెం టెన్షన్ వచ్చిందని వైష్ణవ్ తెలిపారు. కొండపొలం రొమాంటిక్ సీన్స్ లో తన టెన్షన్ పోగొట్టేలా రకుల్, బాగా కోపరేట్ చేసిందంటున్నాడు వైష్ణవ్. కేవలం రకుల్ సహకారం వల్లనే ఆ సన్నివేశాలన్నీ చాలా బాగా వచ్చాయన్నాడు.
