ప్రభాస్ లా కొట్టాలని ఉంది
తొలి సినిమా ‘ఉప్పెన’తో విజయాన్ని అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఇప్పుడు దర్శకుడు క్రిష్ తో జత కట్టాడు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరో ‘కొండపొలం’ తెరకెక్కింది. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్ పాజిటివ్ గా వినిపిస్తున్నది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వైష్ణవ్ తేజ్.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తొలి సినిమా అంతా కొత్త వాళ్లతో. రెండో సినిమా అంతా అనుభవం ఉన్నవాళ్లతో చేశారు. మరీ.. మూడో సినిమా ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అని అడిగితే.. మంచి కధ కావాలి. అలా అని పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమాలకు దూరం అని కాదు. సినిమాలు చూసేటప్పుడు ప్రభాస్ లా కొట్టాలని నాకూ వుంటుంది( నవ్వుతూ). మా ఇంట్లో కూడా నన్ను కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమాలో చూడడానికి ఇష్టపడతారని చెప్పుకొచ్చారు. రీసయ్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న. కొన్ని కధలు వింటున్నానని తెలిపారు.