ధోని ఈజ్ బ్యాక్.. సంబరాల్లో అభిమానులు !

క్రికెట్‌లో అతిగొప్ప ఫినిషర్ అయిన ధోనీ గత కొన్నాళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొప్ప ఇన్నింగ్సులు ఆడటం లేదు. ఒకప్పటి పదనైనా షాట్స్, మెరుపులు ఆయన నుంచి రావట్లేదు. ఈ నేపథ్యంలో నిరాశలో ఉన్న అభిమానులకు ఆదివారం రాత్రి ధోని విందు భోజనం పెట్టేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1లో మహేంద్రసింగ్ ధోనీ (18*) మునుపటి ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో అతడి అభిమానులు సంతోషంలో మునిగితేలారు. చివరి ఓవర్‌లో అతడు మూడు బౌండరీలు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు.
మొదట ఢిల్లీ 5 వికెట్లకు 172 పరుగులు సాధించింది. పృథ్వీ షా (60; 34 బంతుల్లో 7×4, 3×6), పంత్ (51 నాటౌట్; 35 బంతుల్లో 3×4, 2×6), హెట్‌మయర్ (37; 24 బంతుల్లో 3×4, 1×6) రాణించారు. హేజిల్‌వుడ్ (2/29), మొయిన్ అలీ (1/27) బంతితో రాణించారు. రుతురాజ్ గైక్వాడ్ (70; 50 బంతుల్లో 5×4, 2×6), ఉతప్ప (63; 44 బంతుల్లో 7×4, 2×6)ల అదిరే బ్యాటింగ్‌కు కెప్టెన్ ధోని (18 నాటౌట్; 6 బంతుల్లో 3×4, 1×6) కొస మెరుపులు తోడవడంతో లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రుతురాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఐపీఎల్ లో చెన్నై ఫైనల్ కి చేరడం ఇది తొమ్మిదోసారి.
Vintage Thala MSD @msdhoni 🔥#Dhoni #csk #WhistlePodu pic.twitter.com/WGzDInMiLL— A n j u (@Anjuvj3) October 10, 2021