మరో నెలలో కరోనా అంతం ?

దేశంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల సంఖ్యలో భారీగా తగ్గుదల కనిపిస్తున్నది. ఒక్కసారిగా 14 వేలకు దిగివచ్చిన కేసులు.. మార్చి ప్రారంభం నాటి స్థాయికి పడిపోయాయి. ఇదే తరహా తగ్గుదల కొనసాగితే.. మరో నెలరోజుల్లోనే దేశంలో కరోనా అంతం అయిందనే వార్తలు వినవచ్చు.

ఇక గడిచిన  24 గంటల్లో దేశంలో 14,313 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతక్రితం రోజు 18 వేల మందికి వైరస్ సోకగా.. తాజాగా ఆ సంఖ్య 4,000 మేర తగ్గింది. నిన్న ఒక్కరోజే 26,579 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక గత ఏడాది ప్రారంభం నుంచి 3.39 కోట్ల మందికి పైగా వైరస్ బారినపడగా.. అందులో 3.33 కోట్ల(98.04 శాతం) మందికి పైగా మహమ్మారిని జయించారు. మరోపక్క క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 2,14,900(0.63 శాతం)కి తగ్గింది. ఇక మరణాల సంఖ్య కూడా 200 దిగువనే ఉంది. నిన్న 181 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,50,963 మంది కరోనా కాటుకు బలయ్యారు.