హరీష్ ముందే ‘జై ఈటల’ నినాదాలు
హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుకు ఏం చేయాలనో అన్నీ చేస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఎట్లన్ననా జేసి.. ఈటలని ఓడించాలనే పట్టుదలతో ఉంది. కానీ ప్రజల పట్టుదల ముందు టీఆర్ఎస్ ఎత్తులు-జిత్తులు చిత్తయ్యేలా కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఎన్ని చేసినా, ఎన్ని రకాలుగా మభ్యపెట్టినా ప్రజలు ఈటలపై ఉన్న అభిమానాన్ని చంపుకోలేకపోతున్నారు. ఏకంగా మంత్రి హరీష్ రావు రోడ్ షోలో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఈటలకు జై కొట్టారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపు బాధ్యతని సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు భుజాలపై పెట్టిండు. దీంతో రంగంలోకి దిగిన హరీష్ హుజురాబాద్ లో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. చోటా మోటా నేతల కోరికలని తీరుస్తున్నడు. వారిని నడిరోడ్డు మీద నిల్చోపెట్టి అడ్డంగా కొంటుడు. ఈ క్రమంలో హుజురాబాద్ పోరు ‘ఈటల వర్సెస్ హరీష్’రావుగా మారింది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో హుజురాబాద్ ప్రజల్లో ఈటలపై ఉన్న అభిమానాన్ని చంపేసే ప్రయత్నం మంత్రి హరీష్ చేస్తున్నాడు. కానీ అవి ఏమాత్రం ఫలించడం లేదు. సాధారణ ప్రజలు కాదు.. ఏకంగా టీఆర్ఎస్ కార్యకర్తలకే మంత్రికి ఝులక్ ఇస్తున్నారు.
సోమవారం ఇల్లందుకుంట మండలంలో హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఈటలకు జై కొట్టారు. రాచపల్లిలో రోడ్ షోలో ‘ఈటల రాజేందర్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అవాక్కైన మంత్రి హరీష్ రావు.. కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. అది అలవాట్లో పొరపాటు. 15 ఏళ్ల దోస్తానా.. ఆ మాత్రం ఉండదా ? అంటూ కవర్ చేశారు. అంతేకాదు.. స్వార్థం కోసం ఈటల రాజేందర్ రాజీనామా చేశారని ఆరోపించారు.