నెల జీతానికి పనిచేసి.. హిట్ కొట్టాడు !

ఈ ద‌స‌రాకి విడుద‌లైన సినిమాల్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌’ కాస్త బెట‌ర్ రిజల్ట్ ని తీసుకొచ్చింది. తొలి మూడు రోజులూ మంచి వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది. తొలి మూడు రోజులూ మంచి వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది. అయితే ఈ సినిమాకు గాను దర్శకుడు భాస్క‌ర్‌కి పారితోషికం ఇవ్వ‌లేదు. త‌ను కేవ‌లం నెల జీతంపై ప‌ని చేశాడ‌ట‌. నెల‌కు రెండు ల‌క్ష‌ల చొప్పున ఈ సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచీ, ఇప్ప‌టి వ‌ర‌కూ భాస్క‌ర్ కి జీతం ఇస్తూనే ఉన్నారట.

భాస్క‌ర్ కి కూడా అవ‌కాశాలు లేవు. త‌న‌ని తాను నిరూపించుకోవ‌డం చాలా అవ‌స‌రం. పైగా గీతా ఆర్ట్స్ పెద్ద సంస్థ‌. కాబ‌ట్టి… భాస్కర్ రెండు ల‌క్ష‌ల జీతానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఈ సినిమాకి మంచి రిజ‌ల్టే వ‌చ్చిన‌ట్టైంది. ప్లాపుల్లో ఉన్న బొమ్మరిల్లు దర్శకుడు హిట్ ట్రాక్ ఎక్కేశాడు. ఇకపై వరుసగా సినిమాలు చేసుకుంటూ పోవాలనే ప్లాన్ లో ఉన్నాడట.