కొండా వ్యతిరేకులకు వర్మ వార్నింగ్
వద్దంటే చేసి చూపిస్తాడు. అడ్డుకుంటే.. ఇక అదుపులో ఉండడు. హెచ్చరిస్తే.. ఏ మాత్రం ఖాతరు చేయడు. ఆ ఘనుడు ఎవరో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకి అర్థమై ఉంటుంది. అవును.. జగమొండి, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన మరో సంచలన కథని ఎంచుకున్నారు. కొండా మురళీ-సురేఖల కథతో సినిమా తీస్తున్నారు. ఇందుకోసం ఇటీవలే వర్మ కొండా మురళీని కలిశారు. అప్పుడే షూటింగ్ కూడా ప్రారంభించేశాడు. ఇక దానికి తనదైన శైలిలో ప్రచారాన్ని తీసుకొచ్చే పనికి తెరలేపాడు.
తాజాగా ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతి ని ఆపలేరని ఆనాటి కార్ల్ మార్క్స్ తెలుసుకున్నట్టే, పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ఆపలేరని నల్ల బల్లి సుధాకర్ తెలుసుకోవాలి…జై తెలంగాణ’ అంటూ వర్మ ట్విట్ చేశారు. వాస్తవానికి కొండా మురళీ కథ సినిమా కథకి ఏమాత్రం తీసిపోదు. వరంగల్ లో కొండా మురళీ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుల మధ్య చాన్నాళ్ల నుంచి వైరం కొనసాగుతుంది. వీరిద్దరి కనుసన్నలతోనే వరంగల్ రాజకీయాలు నడిస్తున్నాయి. తాజాగా వర్మ సినిమాలో కొండా మురళీని హీరోగా, ఎర్రబెల్లిని విలన్ గా చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే మంత్రి నుంచి కొండాకు అడ్డంకులు ఎదరువుతున్నాయట. వాటి ఫలితమే తాజా వర్మ ట్విట్ లా కనిపిస్తున్నది.
అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతి ని ఆపలేరని ఆనాటి కార్ల్ మార్క్స్ తెలుసుకున్నట్టే, పిచ్చిపిచ్చి ప్రయత్నాలతో కొండా సినిమా షూటింగ్ ఆపలేరని నల్ల బల్లి సుధాకర్ తెలుసుకోవాలి…జై తెలంగాణ— Ram Gopal Varma (@RGVzoomin) October 19, 2021