రొమాంటిక్ పోకిరి

అనిల్ పాడూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి-కేతికా శర్మ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘రొమాంటిక్’. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 29న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హీరో ప్రభాస్ ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. టైటిల్‌కు తగ్గట్లుగానే ట్రైలర్ చాలా రొమాంటిక్‌గా ఉంది. ఆకాష్ అద్భుతంగా నటించాడని ప్రభాస్ కితాబిచ్చారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. స్టన్నింగ్ గా ఉంది. పూరి మార్క్ అడుగడుగున కనిపించింది. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ లో పూరినే కనిపిస్తున్నాడు. ఆఖర్లో ఆకాష్ పోలీస్ గెటప్‌లో కనిపించడం చూస్తే.. ‘పోకిరి’ తరహాలో ఏదో ట్విస్ట్ ఉన్నట్లు అర్థమవుతోంది. ఆకాష్ పూరి డైలాగ్ డెలవరీ, బాడీ లాంగ్వెజ్ ని జాగ్రత్తగా గమనిస్తే.. పోకిరిలో మహేష్ బాబు గుర్తుకు వస్తాడు. అందుకే ఇది రొమాంటిక్ పోకిరి అని పూరి అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం సునీల్ కశ్యప్ అందిస్తున్నారు.