వరల్డ్ కప్ లో పాక్ పై భారత్ ఆధిపత్యానికి కారణాలివే.. !
పాక్ పై భారత్ ప్రపంచకప్ రికార్డ్ పదిలంగా ఉంది. పాక్ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో గానీ, టీ20 ప్రపంచకప్‌లో గానీ భారత్‌ను ఓడించలేదు. ఇప్పుడు టీమ్‌ఇండియా మెగా టోర్నీల్లో పాక్‌పై తన ఆధిక్యాన్ని 13-0కు పెంచుకోవాలనే పట్టుదలతో ఉండగా.. భారత్‌పై తొలి విజయం కోసం పాక్ ఆరాటపడుతోంది. ఈ రెండు జట్ల మధ్య ఈ నెల 24న జరగబోయే పోరు ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ స్పందించాడు. ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవడం, పాకిస్థాన్‌లా వ్యాఖ్యలు చేయకపోవడమే ఆ జట్టుపై భారత్ ఆధిపత్యానికి కారణమని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు.
2011, 2003 ప్రపంచకప్‌లనే తీసుకుందాం. అప్పుడు మేం తక్కువ ఒత్తిడిలో ఉన్నాం. ఎందుకంటే ప్రపంచకప్‌లో పాక్‌పై మాది మెరుగైన స్థితి. మేం ఎప్పుడూ పట్టుదలతో ఆడతాం. ఎప్పుడూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడం. అయితే ‘పాకిస్థాన్ వాళ్లు ఎప్పుడూ పెద్ద ప్రకటనలు చేస్తుంటారు. భారత్ ఏనాడూ అలా చేయలేదు. అందుకే పాక్ పై భారత్ ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుందని సెహ్వాగ్ చెప్పుకొచ్చారు.