టీఆర్ఎస్ కు ఓటమి హెచ్చరిక ?
హుజురాబాద్ ఉప ఎన్నికను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ కచ్చితంగా గెలిచి తీరాల్సిందేనని.. అందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తోంది. ఇతర పార్టీల నుంచి కీలక నేతలని పార్టీలో చేర్చుకుంది. దళిత బంధు లాంటి సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా హుజురాబాద్ లో అమలు చేయాలని నిర్ణయించింది. అర్హుల జాబితాని రెడీ చేసింది. నిధులని విడుదల చేసింది. అర్హుల ఖాతాలో డబ్బు జమ చేసే క్రమంలో.. ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా.. దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఆదేశించింది.
ఉప ఎన్నికలో దళిత బంధు తమ గెలుపు కాయిన్ అని భావించిన గులాబి పార్టీకి ఇది పెద్ద దెబ్బే. అది ఓటమికి కారణం కానుందని లెటెస్ట్ సర్వేల రిపోర్ట్ అని సమాచారమ్. ఎన్నికల సమయంలో ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకోవడం సీఎం కేసీఆర్ కు అలవాటు. దాని ఆధారంగానే ఎన్నికల ఫలితాన్ని కేసీఆర్ ముందే చెప్పేస్తారు. వందశాతం విజయం మనదేనని ధీమాగా ప్రకటిస్తారు. హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలోనూ కేసీఆర్ అదే చేశారు. ఈటల కంటే టీఆర్ఎస్ అభ్యర్థి దాదాపు 13శాతం ఓట్ల ముందంజలో ఉన్నారు. పోలింగ్ తేది వరకు అది ఇంకా పెరగనుందనే అశాభావం వ్యక్తం చేశారు. కానీ దళిత బంధుకు బ్రేక్ పడటంతో పరిస్థితి మారింది.
బీజేపీ వైపు మొగ్గు కనిపిస్తుందని లెటెస్ట్ రిపోర్ట్ అని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను రద్దు చేశారు. దాని స్థానంలో రోడ్ షోస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈరోడ్ షోలని రెండురోజులు నిర్వహించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఎన్నికల సంఘం నిబంధనల నేపథ్యంలో బహిరంగ సభకు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారని చెబుతున్నారు. అయితే ఇది ప్రస్తుత ఈక్వెష్. పోలింగ్ తేది వరకు కాంట టీఆర్ ఎస్ వైపు మొగ్గవచ్చు. ఆ పార్టీ గెలిచే అవకాశాలు లేకపోలేవ్. ఎట్ దిస్ టైమ్ మాత్రం ఈటల లిటిల్ లీడ్ లో ఉన్నట్టు సర్వేల ద్వారా అందుతున్న సమాచారం.