భీమ్లా నాయక్ ఓటీటీ రిలీజ్ – బంపర్ ఆఫర్ ?

సినిమాల రిలీజ్ కు ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకప్పటిలా కేవలం థియేటర్స్ లోనే విడుదల చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యామ్నాయంగా ఓటీటీలు ఉన్నాయి. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు సైతం నేరుగా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. ఈక్రమంలో పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్ కు ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి. సినిమాను థియేటర్ లో విడుదల చేయకుండా నేరుగా డిజిటల్ హక్కులు ఇస్తే మాంచి రేటు ఇస్తామని నిర్మాతలు టెంప్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 140 కోట్ల మేరకు అమెజాన్ ప్రైమ్ ఆఫర్ వున్నట్లు తెలుస్తోంది.

ఈ రేంజ్ ఆఫర్ సౌత్ ఇండియాలో ఇదే ప్రధమం. ఇది కాక శాటిలైట్, హిందీ రైట్స్, అడియో రైట్స్ వుండనే వుంటాయి. అయితే ఈ ఆఫర్ ను నిర్మాతలు తీసుకోకపోవడానికి ఎక్కువ చాన్స్ వుంది. ఇటు హీరో పవన్ కూడా ఈ విషయంలో పెద్దగా పట్టుదలతో ఏమీ లేరు. నిర్మాతకు ఎలా కన్వీనియెంట్ అయితే అలాగే చేసుకోమన్నట్లు తెలుస్తోంది. కానీ పవన్ లాంటి పవర్ ఫుల్ స్టార్ సినిమాను థియేటర్ లోకి తేకుండా ఓటిటికి ఇచ్చేస్తే వ్యవహారం మామూలుగా వుండదు.