టీమిండియా ఓటమికి కారణలివే.. !
కాగితంపై ఎలా చూసినా టీమ్‌ఇండియా కంటే ప్రత్యర్థే బలహీనంగా కనిపించింది. సానుకూలతలన్నీ మనకే.. ప్రతికూలతలన్నీ వాళ్ల వైపే! కానీ విజయం పాకిస్థాన్ ని వరించింది. పాక్ చేతిలో భారత్‌కు పరాభవం. బంతితో దెబ్బ షహీన్ ఆఫ్రిది దెబ్బకొట్టగా.. రిజ్వాన్, బాబర్ బ్యాట్ తో పని పట్టారు. ఫలితంగా పది వికెట్ల తేడాతో కోహ్లీసేన చిత్తయింది.
భారత్-పాక్ మ్యాచ్ అంటే.. తీవ్ర ఒత్తిడి ఉండటం ఖాయం. వత్తిడిని అధిగమించిన జట్టునే గెలుస్తుంది. నిన్నటి మ్యాచ్ లో పాక్ పై ఎలాంటి ఒత్తిడి కనిపించలేదు. సొంత దేశంలో, సొంత మైదానంలో ఆడినట్టు చాలా స్వేచ్చగా ఆడింది పాక్. బౌలింగ్ లో శుభారంభం దొరకగానే.. దాన్ని వందశాతం సద్వినియోగం చేసుకుంది. బ్యాటింగ్ లోనూ ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. స్వేచ్ఛగా ఆడింది. ఇంకా చెప్పాలంటే నెట్స్ లో ప్రాక్టీసు చేసినంత ఈజీగా ఆడి.. గెలిచేసింది.
మరోవైపు ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ పడగానే.. టీమిండియాపై ప్రెజర్ పెరిగింది. 152 పరుగుల లక్ష్యం చేధించడం అంత ఈజీ కాదు. కానీ బౌలర్ల ప్రయోగింపులోనూ కోహ్లీ తప్పటడుగులు వేశాడు. తొలి ఓవర్ భువనేశ్వర్.. తేలిపోయాడు. దీంతో వెంటనే బుమ్రాని తీసుకురావాల్సింది. కానీ కోహ్లీ షమీని నమ్ముకున్నాడు. వారికి వరుసగా రెండు ఓవర్ల్ వేయకుండా మార్చేస్తూ వెళ్లాడు. కనీసం ఒకట్రెండు వికెట్లు పడిన ప్రెజర్ పాకిస్థాన్ వైపు షిఫ్ట్ అయింది. మొత్తానికి… తమదైన రోజు ఎలాంటి జట్టునైనా పాకిస్థాన్ కు ఆదివారం వారిరోజు అయింది.