సంక్రాంతి సినిమాలు సైడైపోతున్నయ్

అక్టోబర్ 13న రావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ వచ్చే యేడాది జనవరి 7కి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటికే సంక్రాంతికి రిలీజ్ డేటు ప్రకటించుకున్న సినిమాలన్నీ ఇప్పుడు సైడైపోతున్నాయి. కొత్త డేట్లను వెతుక్కుంటున్నాయి. ఎఫ్ 3 రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం ఇప్ప‌టికే ప్రక‌టించేసింది. ఈ సినిమాని ఫిబ్ర‌వ‌రి 25కి షిఫ్ట్ చేశారు.

ఇప్పుడు భీమ్లా నాయ‌క్‌, స‌ర్కారు వారి పాట కూడా అదే దారిలో వెళ్ల‌బోతున్నాయి. స‌ర్కారు వారి పాట‌ని వేస‌వి బ‌రిలో నిలిపే ఛాన్సుంద‌ని స‌మాచారం. భీమ్లా నాయ‌క్ ఉగాదికి విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. లేదంటే.. ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేస్తారు. జ‌న‌వ‌రి 26 కూడా ఓ ఆప్ష‌నే. మొత్తానికి సంక్రాంతి పోటీ నుంచి ఈ రెండు సినిమాలూ త‌ప్పుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక RRR కి పోటీ ఇచ్చేది ఒక్క రాధే శ్యామ్ మాత్ర‌మే. కొత్త‌గా వ‌చ్చిన టీజ‌ర్ లో జ‌న‌వ‌రి 14న విడుద‌ల అంటూ… స‌మ‌ర‌శంఖం ఊదేసింది. RRR జ‌న‌వ‌రి 7న వ‌స్తుంది. రాధేశ్యామ్ రావ‌డానికి మ‌రో వారం గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ స‌రిపోతుంది కూడా. దాంతో పాటు సంక్రాంతి పెద్ద సీజ‌న్‌. రెండు సినిమాల‌కు గ్యారెంటీగా చోటుంటుంది. మిగితా సినిమాలు మాత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్టే.