లైఫ్ కు లేదు గ్యారెంటీ

శాండిల్ వుడ్ పవర్ స్టార్ , అభిమానులంతా అప్పు అని ముద్దుగా పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. వ్యాయామం చేస్తుండగా పునీత్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది. హుటాహుటిన ఆయన్ను విక్రమ్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా పునీత్ ను కాపాడలేకపోయారు. ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 46 ఏళ్లు. పునీత్ కు ఇద్దరు పిల్లలు. బాలనటుడిగా, హీరోగా, నిర్మాతగా, గాయకుడిగా, టీవీ ప్రజెంటర్ గా.. ఇలా ఎన్నో అవతారాల్లో మెప్పించారు పునీత్. ఇటు టాలీవుడ్ తో కూడా మంచి సత్సబంధాలు కలిగి ఉన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కు పునీత్ చాలా క్లోజ్. పునీత్ నటించిన ఓ సినిమాలో ఎన్టీఆర్ పాట కూడా పాడాడు. 

భారతీయ సినీ పరిశ్రమలో ఇటీవల ఇలాంటి సడెన్ డెత్త్ లు షాక్ కి గురి చేస్తున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని షాక్ ఇచ్చారు. ఇటీవలే బాలీవుడ్ సీరియల్ నటుడు, బిగ్ బాస్ విన్నర్ సిద్ధార్ శుక్లా హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. తాజాగా పునీత్ రాజ్ కుమార్ మన నుంచి దూరం అయ్యారు. పవర్ స్టార్ అయినా, పవర్ ఫుల్ మేన్ అయినా లైఫ్ కు లేదు గ్యారెంటీ అన్నది స్పష్టం అవుతున్నది.  దీనికి కారణం.. పర్యావరణమా ? బిజీ లైఫ్ లో కొట్టుకుపోతూ.. గుండెలు ఆగిపోతున్నాయా ? అన్నది చర్చించాల్సిన అవసరం ఉంది.