పుష్ప : సునీల్ (మంగళం శ్రీను) ఫస్ట్ లుక్

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన కథానాయిక. ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా సినిమాలో సునీల్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. మంగళం శ్రీను పాత్రలో సునీల్ కనిపించనున్నారు. సీరియస్ విలన్ లుక్ లో సునీల్ కొత్తగా కనిపిస్తున్నాడు. ‘కలర్ ఫోటో’ సినిమాలో విభిన్నమైన విలనీజం చూపించారు సునీల్. పుష్ప దానికి కొనసాగింపుగా.. ఇంకా క్రూరంగా ఉండబోతున్నట్టు మంగళం శ్రీను ఫస్ట్ లుక్ ని చూస్తే అర్థమవుతోంది.

ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. రెండు పార్టులుగా పుష్ప తెరకెక్కుతోంది. డిసెంబర్ 17న పుష్ప పార్ట్ -1 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బన్నీ ఎర్రచందనం దుంగలని తరలించే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. 

 

#WeWantPushpaHindiRelease tag started trending. Need all @alluarjun sir fans support for hindi release. @MythriOfficial @PushpaMovie @imsarathchandra #Pushpa #PushpaTheRise #Taggedeley #Taggedele #AlluArjun #IconStar #IconStAAr #Sunil #MangalamSrinu pic.twitter.com/TBzlFLY3qK— OTTRelease (@ott_release) November 7, 2021