కేసీఆర్ పై ఈడీ, ఐటీ ఎటాక్స్ ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఈడీ, ఐటీ దాడులు జరగనున్నాయా ? అందుకే ఎప్పుడూ లేనిది సీఎం కేసీఆర్ కేంద్రాన్ని అటాక్ చేస్తున్నాడా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణలో బీజేపీ బలం మరింత పెరిగినట్టయింది. అక్కడ టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళీతబంధు వర్కవుట్ కాలేదు. ఓటుకు ఆరు వేల రూపాయలు పని చేయలేదు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్, బీజేపీ పై ఉన్న నమ్మకం ఫలించింది. అయితే హుజురాబాద్ లో ఓటమి తర్వాత సీఎం కేసీఆర్ అలర్టైనట్టు కనిపిస్తున్నది. ఇన్నాళ్లు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఆయన చేస్తున్న ఆరోపణలపై స్పందించలేదు. అసలు కేసీఆర్ నోటి వెంట బండి సంజయ్ అనే మాటే వినిపించేది కాదు.

అయితే తొలిసారి ఆదివారం మీడియా సమావేశంలో బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. ఇకపై నేనే రంగంలోకి దిగుతా. నీ భరతం పడతానని ప్రకటించారు. చెప్పినట్టుగానే సోమవారం రెండోసారి ప్రెస్ మీట్ పెట్టారు. బండి సంజయ్ ఆరోపణలపై కౌంటర్ ఇస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ ప్రసంగంలో పదే పదే వినిపిస్తున్న మాటలు ఈడీ, ఐటీ దాడులు. కేంద్రంతో అనిగిమనిగి ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడితే.. దోశద్రోహులు అనే ముద్రవేస్తారు. ఈడీ, ఐటీ దాడులు చేయిస్తారని సీఎం కేసీఆర్ అన్నారు. మిగితా రాజకీయ పార్టీలు, నేతల్లా అల్లాటప్పా మాటలకు భయపడేది లేదు. ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అని కేసీఆర్ గర్జించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న పథకాలపై ప్రశ్నించారు. దమ్ముంటే.. పెట్రోల్, డిజీల్ పై కేంద్రం విధిస్తున్న అన్ని రకాల సెజ్ లని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే కేసీఆర్ ప్రసంగంలో కేంద్రం ఈడీ, ఐటీ దాడులతో భయపెడుతుందనే మాటలు రావడం చర్చనీయాంశంగా మారింది. కొప్పదీసి. . కేంద్రం కేసీఆర్ ని టార్గెట్ చేసిందా.. ? అందుకే కేసీఆర్ దాడుల గురించి పదే పదే మాట్లాడుతున్నారా ? అని చెప్పుకుంటున్నారు.