RRR సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది

ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న #RRR చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో #RRR సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసింది చిత్రబృందం. ఈ క్రమంలో సినిమాలోని రెండోసాంగ్ ని రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. రేపే రెండో సాంగ్ రాబోతుంది. అది కూడా పూర్తి సాంగ్ రాబోతుందనే బజ్ నడుస్తోంది. ప్రస్తుతం #RRRSecondSingle యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉంది. సాంగ్ తో పాటు కొన్ని స్టిల్స్ కూడా వదులుతారట.

బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కోమరంభీమ్ ల జీవితాల్లోని ఓ ఉమ్మడి పాయింట్ ఆధారంగా జక్కన్న ఈ కథని రాసుకున్నారు. అల్లూరిగా చరణ్, ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ఇక కొమరంభీమ్ పాత్రలో తారక్, ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం. ఎం కీరణవాణి. డివివి దానయ్య నిర్మాత.