‘తీన్మార్ మల్లన్న 2.O’ తట్టుకుంటారా ?

ప్రతిపక్షాలను మించి కేసీఆర్ ప్రభుత్వానికి చుక్కలు చూపించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. ప్రజల గొంతుకగా, ప్రశ్నించే గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వాన్ని కడిగేశాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేని కేసీఆర్ సర్కారు మల్లన్నను అరెస్ట్ చేయించింది. అవి అక్రమ కేసులా ?, సక్రమ కేసులా ? అని పక్కనపెడితే.. ఒకే ఒక్క కేసులో అరెస్ట్ చేసి.. 38 కేసులు మోపింది. ఎస్సీ, ఎస్టీ అల్ట్రాసిటీ కేసుతో పాటు పీటీ వారెంట్లు నమోదు చేసింది. ఇదంతా గమనించిన సాధారణ ప్రజలకు మల్లన్న అరెస్ట్ పెద్దకుట్ర అనే అనుమానం రాక మానదు.

హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. మల్లన్న అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తే.. భారీ డ్యామేజ్ తప్పదని అంచనా వేసింది. అందుకే సరిగ్గా ఉప ఎన్నిక ముందు మల్లన్నని అరెస్ట్ చేశారని మల్లన్న అభిమానులు చెబుతున్నారు. మల్లన్నని జైల్లో పెట్టినా.. హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలవలేకపోయింది. ఈ విషయం పక్కన పెడితే.. గతంలో తీన్మార్ మల్లన్న ఎక్కుపెట్టే ప్రశ్నలకు కేసీఆర్ సర్కారు వద్ద సమాధానాల్లేవ్. ఇప్పుడు జైలుకెళ్లి మల్లన్న తిరిగొచ్చారు. ఆయనలో మరింత కసి పెరిగింది. దానంత కేసీఆర్ సర్కార్ పై చూపించబోతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే తీన్మార్ మల్లన్ననే కేసీఆర్ సర్కార్ తట్టుకోలేదు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ‘తీన్మార్ మల్లన్న 2.O’ను తట్టుకుంటుందా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇన్నాళ్లు మల్లన్న సింగిల్. ఇప్పుడు ఆయన జాతీయపార్టీ బీజేపీ నాయకుడు. ఇది ఆయనకు మరింత అండా-దండా కానుంది. అసలే హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమితో సీఎం కేసీఆర్ టెన్షన్ లో కనిపిస్తున్నడు. కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావుని నమ్ముకుంటే లాభం లేదని.. స్వయంగా తానే రంగంలోకి దిగాడు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తో పాటు కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వాటిని బండి సంజయ్, ఎంపీ అరవింద్ లాంటోళ్లు గట్టిగానే తిప్పి కొడుతున్నారు. ఇప్పుడు వీళ్లకు తీన్మార్ మల్లన్న తోడుకానున్నాడు. ఇక కేసీఆర్ పై త్రిముఖ దాడే.. తీన్మారే. దాన్ని ఆయన ఎలా తట్టుకుంటారు ? అన్నది పొలిటికల్ సినిమాలో చూసి.. తరించాల్సిందే.