బాబాయ్-అబ్బాయ్.. ఎవరు హిట్టు ?

బుల్లితెరపై బాబాయ్-అబ్బాయ్’ల హవా కొనసాగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బుల్లితెర కొత్తేమీ కాదు. బిగ్ బాస్ షోని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది తారక్ నే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 కి తారక్ హోస్ట్ గా వ్యవహరించారు. షోని ఆధ్యాంతం అద్భుతంగా డీల్ చేశారు. బిగ్ బాస్ తెలుగును ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆ తర్వాత కూడా ప్రతి సీజన్ కోసం ఎన్ టీఆర్ ను అడుగుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. కానీ తారక్ కు వీలుపడటం లేదు. అయితే జెమినీ టీవీ కోసం వీలు చేసుకొని మరీ.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు తారక్. హోస్ట్ సీటులో కూర్చొని హాట్ సీటులో ఉన్నవారికి, ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తూ వినోదాన్ని అందజేస్తున్నారు.

మరోవైపు అబ్బాయ్ కి పోటీగా బాబాయ్ దిగిపోయారు. బాలయ్య హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్’ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది టీవీ షో కాదు. ఓటీటీ షో. తనదైన శైలిలో బాలయ్య షోని రక్తికట్టిస్తున్నారు. పేరుకు ఆహా ఓటీటీ షో అయినా.. ఎక్కువగా బుల్లితెర ప్రేక్షకులే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబాయ్-అబ్బాయ్ లలో ఎవరు హిట్టు ? అనే చర్చ జరుగుతుంది. నందమూరి అభిమానులు మాత్రం ఇద్దరు హిట్టే అని చెబుతున్నారు. మిగిలినవారు.. చెరో మాట చెబుతున్నారు. నిజానికి మాత్రం బాబాయ్-అబ్బాయ్ ఇద్దరు అదరగొడుతున్నారు.