ఐటమ్.. ఆల్ వేస్ వెల్ కమ్ !

పూజా హెగ్డే – తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా దున్నేస్తోంది. యంగ్ హీరో, స్టార్ హీరో అనే తేడా లేకుండా రొమాన్స్ చేస్తోంది. వరుసగా విజయాలు అందుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు ‘జిగేల్’ (ఐటమ్ సాంగ్) ఆఫర్లు వస్తున్నాయి. ‘రంగస్థలం’లో జిగేల్ రాణిగా కుర్రకారుకు పిచ్చేక్కించేసింది.. పూజా. ఇకపై కూడా అలాంటి ఐటమ్ సాంగ్స్ లో మెరుస్తారా ? ప్రశ్నకు తాజాగా సమాధానం చెప్పింది.

“స్పెషల్ సాంగ్స్ చేయకూడదని లేదు. అలా అని ప్రత్యేకంగా నేను ప్లాన్ చేయను. నా మనసుకు నచ్చినవి చేసుకుంటూ వెళ్లాను. ఓ మంచి సాంగ్ ఉందంటే కచ్చితంగా చేస్తాను. స్పెషల్ సాంగ్స్ ఉంటే తీసుకురండి. నాకు నచ్చితే కచ్చితంగా చేస్తాను. ఎలాంటి అభ్యంతరం లేదు.” అంటూ ఐటమ్ సాంగ్స్ పై తన మనసులో మాటను బయటపెట్టింది పూజాహెగ్డే.అంతేకాదు.. పాత్ర చిన్నదైనా స్టార్ హీరో, పెద్ద డైరక్టర్ అయితే చేస్తానని ఓపెన్ గా చెప్పేసింది.. ముద్దుగుమ్మ.
