రియా.. బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అరెస్టు అయ్యి, ఎన్సీబీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో కొన్నాళ్ల పాటు జైల్లో ఉండి విడుదల అయిన రియాకు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ల విషయంలో కూడా ఉపశమనం లభించింది. రియా బ్యాంక్ అకౌంట్లను డీఫ్రీజ్ చేస్తూ న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. అలాగే ఆమె ఐ ఫోన్, ఐప్యాడ్ లను కూడా తిరిగి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

రియా అరెస్టు అయిన సమయంలో రకరకాల రచ్చ జరిగింది. ఆమెకు డ్రగ్స్ లింక్స్ ఉన్నాయనే ప్రచారం సాగింది. ఆ వ్యవహారం పై మీడియాలో నానా రచ్చ జరిగింది. ఒక సుశాంత్ అభిమానులు రియాపై దుమ్మెత్తి పోశారు. రియాను ఒక తిరుగుబోతు తరహాలో అభివర్ణించడానికి కానీ, ఆమె పై ఇంకా తీవ్రమైన నిందలు వేయడానికి కూడా కొంతమంది వెనుకాడలేదు. అప్పట్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని గట్టిగా వాడుకున్నారు.