టీఆర్ఎస్ పట్టు జారిపోతోంది
తెలంగాణలో ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ దే గెలుపు. అయితే ఇది గతం. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు ఏవైనా బీజేపీదే గెలుపుగా పరిస్థితి మారింది. రాష్ట్రంలో కమలనాథులు బలంగా పుంజుకుంటున్నారు. ఒకప్పటిలా కేసీఆర్ మాటల గారడి పనిచేయడం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో ఇంటికో పదివేలు ఇచ్చినా… అదే మైనస్ గా మారింది. హుజురాబాద్ లో దళీతబంధు పేరుతో పది లక్షలు, ఓటుకో ఆరువేలు పంచినా.. గులాబి పార్టీకి లాభం చేకూర్చలేదు. ఇదీగాక.. గతంలో టీఆర్ఎస్ నేతలు హైకమాండ్ గీసిన గీత దాటేవారు కాదు. ఇప్పుడు.. పార్టీపై హైకమాండ్ పట్టు సడలుతోంది. దానికి సాక్ష్యంగా స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు కనిపిస్తున్నాయి.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్వతంత్ర అభ్యర్థులు పోటా పోటీగా నామినేషన్లు వేశారు. నిజానికి టీఆర్ఎస్‌కు 12 స్థానాల్లోనూ స్పష్టమైన మెజార్టీ ఉంది. కానీ ఆ పార్టీ నుంచే రెబల్స్ రంగంలోకి దిగారు. మామూలుగా అయితే ఏకగ్రీవం చేసుకోవాల్సిన ఎన్నికలు. కానీ 12 స్థానాలకు ఏకంగా 94 మంది నామినేషన్ వేశారు. వీరిలో 77 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు. అంతా టీఆర్ఎస్‌కు చెందిన వారే. టీఆర్ఎస్ అధినేత ఖరారు చేసిన అభ్యర్థులపై క్యాడర్‌లో అసంతృప్తి నెలకొంది. దీనిని బట్టి.. తెలంగాణలో టీఆర్ఎస్ పట్టు జారిపోతోంది. పార్టీపై హైకమాండ్ పట్టు సడలుతోందని అనిపిస్తున్నది.