ఎస్తేర్ ఓపెన్ చేసేసింది

ఎస్తేర్ అనిల్ – 2010లో వచ్చిన ‘నల్లవన్’ చిత్రం ద్వారా బాలనటిగా తెరకు పరిచయం అయింది. మలయాళ డ్రామా థ్రిల్లర్ ‘దృశ్యం’ సినిమాతో పాపులర్ అయింది. ఇదే సినిమా తెలుగు రిమేక్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవల వచ్చిన దృశ్యం 2 లోనూ మలయాళ, తెలుగు వర్షన్స్ లోనూ ఎస్తేర్ పాత్ర కంటిన్యూ అయింది. అయితే పార్ట్ 1, 2 ల మధ్య ఎస్తేర్ చాలా ఎదిగింది.

మొదటి పార్టులో చిన్నారి ఎస్తేర్ ముద్దుగా, బొద్దుగా కనిపించింది. సీక్వెల్ వచ్చేసరికి చాలా పెద్దదైంది. హాట్ గా తయారైంది. సినిమాలో కంటే.. బయట హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఎస్తేర్ అనిల్ అందాలు గ్లామర్ హీరోయిన్ కి సరిగ్గా సరిపోతాయని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. ఆమె వైపు దర్శక -నిర్మాతలు చూస్తున్నారు. అతి త్వరలోనే ఎస్తేర్ అందాలను పూర్తి స్థాయిలో వాడుకునేందుకు స్కెచ్ లు వేస్తున్నారు. స్క్రిప్టులు రాస్తున్నారు. ఆలోగా సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతని కంటిన్యూ చేసేలా ఉంది.. ఈ యంగ్ హాట్ బ్యూటీ.