జ‌న‌నీ.. ఓ ఎమోష‌న‌ల్ డ్రైవ్‌

తెలుగు మీడియాకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు దర్శకధీరుడు రాజ‌మౌళి. ఆయన చిత్రం ఆర్.ఆర్‌.ఆర్ నుంచి మ‌రో పాట వ‌చ్చింది. అదే జ‌న‌నీ. నిజానికి రేపు ఈ పాట విడుద‌ల అవుతోంది. కానీ… తెలుగు మీడియా కోసం మాత్రం.. ఒక రోజు ముందే ఈ పాటని వినిపించాడు రాజ‌మౌళి. ఆర్కే కాంప్లెక్స్‌లో జ‌రిగిన ప్రెస్ మీట్లో ఈ పాట‌ని మీడియా కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన  రాజ‌మౌళి.. ఆర్‌.ఆర్‌.ఆర్‌లోని ఎమోష‌న్నీ మ‌ణిహారం అయితే.. ఆ మ‌ణిపూస‌ల్ని ప‌ట్టి ఉంచే దారంలాంటిది ఈ జ‌న‌నీ పాట అన్నారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌లో చాలా ఎమోష‌న్లు ఉంటాయి. యాక్ష‌న్ సీక్వెన్స్ ఉంటాయి. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్స్ ఉంటాయి. వాట‌న్నింటిలోనూ కోర్ గా వినిపించి, క‌నిపించే పాట ఇదని  జక్కన్న చెప్పుకొచ్చాడు.

#RRRSoulAnthem #Janani https://t.co/yLpX0CS1cM— OTTRelease (@ott_release) November 25, 2021