టాలీవుడ్ పై చావుదెబ్బ

ఏపీ ప్రభుత్వం అన్నంత పనిచేసింది. ఆన్ లైన్ లో సినిమా టికెట్ విధానం కోసం కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని ఆమోదించింది. ఆ చట్టం ప్రకారం ఇకపై ఏపీలో ఎలాంటి సినిమాలు నాలుగు షోలు మాత్రమే వేస్తారు. బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఉండదు. మల్టిప్లెక్స్‌లలోనూ నాలుగు షోలే వేయాల్సి ఉంటుంది. 

పేద, మధ్య తరగతి ప్రజలకు వినోదం సినిమా కాబట్టి.. వారి బలహీనతలు సొమ్ము చేసుకోకుండా ప్రభుత్వం కాపాడుతుందన్నారు. ఆన్ లైన్ టిక్కెట్ విధానం వల్ల మాత్రమే ఇది సాధ్యమని..స్పష్టం చేశారు. ప్రస్తుతం సినిమాల వసూళ్లు, జీఎస్టీని పోల్చి చూసుకుంటే పొంతనే లేదన్నారు. కొత్త బిల్లు ఆమోదం పొందడంతో భారీ బడ్జెట్ సినిమాలకు ఏపీలో గడ్డు పరిస్థితులు ఎదురు కానున్నాయి. ధియేటర్లకూ నష్టమే.

ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ఆయనకు సినిమా వాళ్ల సహాయ-సహకారాలు ఆశించిన స్థాయిలో అందడం లేదు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ పై జగన్ సర్కారు కక్ష్య కట్టింది. అందుకే కొత్త బిల్లు రూపంలో చావు దెబ్బకొట్టిందనే ప్రచారం జరుగుతున్నది.