శివ శంక‌ర్ మాస్ట‌ర్‌’కు సోనూసూద్ సాయం

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. శివ శంకర్ మాస్టర్ భార్య కరోనాతో హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు.

శివ శంకర్ మాస్టర్ కు చికిత్స అందించడం కష్టమవుతోంది. రోజుకు లక్షల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు అవుతోంది. ఆయన్ని ఆదుకునేందుకు పెద్ద మనసుతో ముందుకు రావాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు వెలిశాయి. అయితే ఈ పోస్టుకు టాలీవుడ్ సినీ పెద్దలు, స్టార్ హీరోల నుంచి స్పందన కరువైంది. కానీ రియల్  హీరో సోనూసూద్ స్పందించారు.


“నేను శివ శంక‌ర్ మాస్ట‌ర్ కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడుతున్నా. ఆయ‌నకు కావ‌ల్సిన స‌హాయం అందించ‌డానికి సిద్ధంగాఉన్నా“ అంటూ సోనూ ట్వీట్ చేశాడు. దాంతో శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఆసుప‌త్రి బిల్లుల స‌మ‌స్య దాదాపుగా తొల‌గిపోయిన‌ట్టే. తెలుగు హీరోల‌తో శివశంకర్ మాస్టర్ కు మంచి అనుబంధ‌మే ఉంది. వాళ్లంద‌రికంటే ముందు.. సోనూ స్పందించి, ముందుకురావ‌డం గొప్ప విషయం.