ఇలా రెచ్చగొడితే.. ఎలా రాశీ ?

హీరోయిన్ రాశీఖన్నా అసలే అందగత్తె. ఆ అందాలతోనే వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంది. హిట్స్ అందుకుంది. గ్లామర్ హీరోయిన్ గా వెలిగిపోతున్న టైమ్ లో తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టింది. ‘తొలిప్రేమ’తో అద్భుత నటి అనిపించుకుంది. ప్రస్తుతం గ్లామర్ పాత్రలతో పాటు నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నది. ఇంతటి బిజీలోనూ హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తోంది.

ఈ క్రమంలో ఆరేంజ్ కలర్ గౌనులో రాశీ రెచ్చిపోయింది. వివిధ భంగిమలతో అందాలను ఆరబోసింది. ఇవి చూసిన కుర్రకారు.. ఇలా రెచ్చిగొడితే ఎలా రాశీ ? అంటూ లవ్ సింబల్స్ కురిపిస్తున్నారు. ఇక రాశీ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం #Yodha రెగ్యూలర్ షూటింగ్ ఈరోజే ప్రారంభం అయింది. ఇందులో రాశీ సిద్ధార్థ్ మల్హోత్రకి జంటగా కనిపించనుంది.



