కసి మీద సామ్

నాగ చైతన్యతో విడిపోయిన సమంత కసి మీద కనబడుతున్నది. నటిగా తానేంటో ప్రపంచానికి చూపిస్తానన్న తాపత్రయం ఆమెలో కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే సినిమాలపై దృష్టి పెట్టింది సమంత. ఇందులో భాగంగా ఇప్పటికే 2 సినిమాలు ఓకే చేసింది. పుష్ప సినిమాలో బన్నీ సరసన ఐటెంసాంగ్ కూడా చేయబోతోంది. ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ ప్రాజెక్టు ప్రకటించింది ఈ బ్యూటీ. ఫిలిప్ జాన్ దర్శకత్వంలో ఓ ఇంటర్నేషనల్ ఫిలిం చేయబోతోంది సమంత. ఈ సినిమా పేరు ఎరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్. ఇదే పేరుతో భారతీయ రచయిత ఎన్.మురారి రాసిన పుస్తకానికి నవలా రూపం ఈ చిత్రం.

ఈ సినిమాలో బై-సెక్యువల్ తమిళ అమ్మాయిగా సమంత కనిపించబోతోంది. కేవలం పురుషులకు మాత్రమే కాకుండా, స్త్రీల ఆకర్షణకు కూడా లోనయ్యే యువతి పాత్ర అన్నమాట. ఈ పాత్రలో సామ్ బోల్డ్ గా కనిపించనుందట. హాలీవుడ్ సినిమా కాబట్టి.. సామ్ న్యూడ్ గా కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో.. ! ‘ఫ్యామిలీ మేన్ సీజన్-2’లో సామ్ పోషించిన రెబల్ తమిళ యువతి పాత్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన వివాదాస్పద పాత్రను పోషిస్తోంది సమంత. మొత్తానికి.. సామ్ లో కసి ఇప్పట్లో చల్లారిలేలా లేదు. గ్లోబల్ స్టార్ అనిపించుకొని తీరాలనే పట్టుదలతో కనిపిస్తున్నది.

Her first international project…
Sry she is the first south Indian actress to have in international project @Samanthaprabhu2 all the very best 💥♥😍#SamanthaRuthPrabhu#SamanthaRuthPrabhuInHollywood #Samantha

India’s Samantha Boards ‘Arrangements of Love’ Cast (EXCLUSIVE) pic.twitter.com/hNb7emWxlY— OTTRelease (@ott_release) November 26, 2021