భీమ్లా నాయక్ పాట.. అడవి తల్లి మాట

పర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ ‘భీమ్లానాయక్‌’. రానా దగ్గుబాటి మరో కథానాయకుడు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. రానాకు జోడీగా సంయుక్త మేనన్‌, పవన్‌కు జోడీగా నిత్యామేనన్‌ సందడి చేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘భీమ్లా నాయక్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్రబృందం. ఇప్పటికే టీజర్, మూడు పాటలు వచ్చేశాయి. నాల్గో సింగిల్ ‘అడవి తల్లి మాట.. ‘ ను రేపు ఉదయం 10:08 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో రిలీజ్ డేటుని కూడా పేర్కొన్నారు.

వకీల్ సాబ్ తర్వాత పవన్ నుంచి వస్తున్న చిత్రమిది. ఈ సినిమా తర్వాత పవన్ నుంచి వరుస సినిమాలు రాబోతున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, హరీష్ శంకర్ సినిమా, సురేందర్ రెడ్డి సినిమాలు రాబోతున్నాయి.

It’s time to take in the #EssenceOfBheemlaNayak – అడవి తల్లి మాట ❤️#AdaviThalliMaata, 4th single from #BheemlaNayak Out tomorrow at 10:08am🎵@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MusicThaman @MenenNithya @iamsamyuktha_ @ramjowrites @dop007 @adityamusic pic.twitter.com/i8bSkmLd1u— OTTRelease (@ott_release) November 30, 2021