అఖండ థియేటర్ లో అగ్నిప్రమాదం

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘అఖండ’ థియేటర్స్ లోకి వచ్చేసింది. అంతేకాదు.. అఖండ అదిరిపోయిందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. బాలయ్య-బోయపాటి కాంబో హ్యాట్రిక్ కొట్టిందని నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇలాంటి హ్యాపీ మూడులో ఓ విషాదం చోటు చేసుకుంది.

వరంగల్ లోని జెమిని థియేటర్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. ఇది గమనించిన ప్రేక్షకులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. కొద్ది క్షణాల్లోనే థియేటర్ మొత్తం పొగలు కమ్ముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన థియేటర్‌ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేశారు. థియేటర్ వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ తో థియేటర్లు మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం ఎలాంటి ప్రాణహాని జరగలేదని సమాచారం.