రస్మిక హోమ్ కిస్సెస్‌

టాలీవుడ్‌ ఐకాన్ స్టార్‌ అ‍ల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం  ‘పుష్ప’. ఈ సినిమా లో  ఆమె ఫస్ట్‌ లుక్‌, సామీ సామీ సాంగ్‌ ఎంత హిట్టయ‍్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామీ సామీ సాంగ్‌లో తన ఎక్స్‌ప్రెషన్స్‌, అందంతో అభిమానులను అలరించింది.   పాన్ ఇండియా మూవీగా ‘పుష్ప’ డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తాజాగా తన ఇన్‌స్టా గ్రామ్‌ అకౌంట్‌లో ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ అభిమానులను ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తన పెంపుడు కుక‍్క ‘పూచ్‌ ఒరా’ని ముద్దు పెట్టుకున్న ఫొటో షేర్‌ చేస్తూ ‘వెల్‌కమ్‌ హోమ్‌ కిస్సెస్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇది చూసిన రష‍్మిక అభిమానులు ‘ఛ.. ఒరాకు వచ్చిన  ఛాన్స్ మాకు రాలేదే..  కనీసం కుక్కలా పుట్టిన బాగుండేది.’ అని కామెంట్‌ పెడుతున్నారు. రశ్మిక  కిశోర్‌ తిరుమల దర్శకత‍్వంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో నటించనుంది ఈ ముద్దుగుమ్మ.