బైక్ పై 179 చలానాలు.. ట్విస్ట్ ఏంటంటే ?

ఒకే బైక్ పై 179 చలానాలు. రూ.42,475 జరిమానా చెల్లించాలని తేలింది. దీంతో ఆ వ్యక్తి వాహనాన్ని వదిలి పారిపోయాడు. హైదరాబాద్ కాచిగూడలో ఈ ఘటన జరిగింది.
కాచిగూడ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం… సోమవారం సాయంత్రం అలీకేఫ్ చౌరస్తాలో ఎస్సై విజయ్ తనిఖీలు చేస్తున్నారు. ఓ ద్విచక్ర వాహనంపై 179 కేసులు పెండింగ్‌లో ఉన్నందుకు రూ.42,475 జరిమానా చెల్లించాలని తేలింది. దీంతో ఆ వ్యక్తి వాహనాన్ని వదిలి పారిపోయాడు. మెదక్ జిల్లాకు చెందిన రత్నయ్య పేరిట వాహనం ఉన్నట్లు గుర్తించారు.