బాలయ్య 6రోజుల్లోనే దున్నేశాడు
బాలయ్య గర్జనతో బాక్సాఫీస్ మరోసారి షేక్ అయింది. ఆయన తాజా చిత్రం ‘అఖండ’ అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం 6 రోజుల్లోనే పెట్టుబడి తిరిగి తీసుకొచ్చింది. వరల్డ్ వైడ్ (టోటల్) 51.50 కోట్లు రాబట్టింది. అన్నీ కలుపుకొని ‘అఖండ’ బడ్జెట్ రూ. 54 కోట్ల ఖర్చు అయినట్టు సమాచారం.
అది ఆరు రోజుల్లోనే తిరిగి వచ్చేసింది. ఇకపై వచ్చేవన్నీ లాభాలే. ఈ ఆరు రోజుల్లో నైజాం నుంచి రూ. 11.40 కోట్లు, సీడెడ్ రూ. 10.55 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 4.41 కోట్లు, ఈస్ట్ రూ. 2.94 కోట్లు, వెస్ట్ రూ. 2.36 కోట్లు, గుంటూరు రూ. 3.62 కోట్లు, కృష్ణా రూ. 2.63 కోట్లు, నెల్లూరు రూ. 1.78 కోట్లు, ఏపీ + తెలంగాణ (టోటల్) రూ. 42.8, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 8.7 Cr వరల్డ్ వైడ్ (టోటల్) 51.50 కోట్లు కలెక్ట్ చేసింది.
బోయపాటి-బాలయ్య కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. బాలయ్యకి జంటగా ప్రగ్యా జైశ్వాల్ నటించింది. థమన్ సంగీతం అందించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. సినిమాలో ఎమోషన్స్ కంటే ఎలివేషన్స్ సీన్స్ హైలైట్ అయ్యాయి. బాలయ్యని ఎంత పవర్ ఫుల్ గా చూపించాలో.. అంత పవర్ ఫుల్ గా చూపించాడు బోయపాటి. బోయపాటి ఒరలో బాలయ్య విశ్వరూపం ఎలా ఉంటుందో.. మరోసారి తెలుగు ప్రేక్షకులకి రుచి చూపించినట్టయింది.